Thursday, 28 May 2026

అపరే నియతాహారాః

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి। సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః॥30॥4॥ శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిథ రకాల హోమాల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పటి వరకూ నీకు నేను ఎన్ని రకాల హోమాల గురించి చెప్పాను కదా!ఆఖరుగా ఇంకొక్క హోమం గురించి చెబుతాను.ఇక్కడ నియమితమయిన ఆహారపరులుగా ఉండాలి.ఆ స్థితిలో ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తారు.అంటే ఊపిరి బిగబట్టి ప్రాణాయామం చేసినా,నియమిత ఆహారంతో ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేసినా,ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో హోమం చేసినా....ఎవరు ఏ రకంగా వారి వారికి తగినట్లు చేసినా,వాళ్ళందరి ఉద్దేశం ఒక్కటే!వారి వారి యజ్ఞాలు,యాగాలు,హోమాల ద్వారా పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నారు.మనసు,శరీరం నిర్మలం,స్వచ్ఛం అయినప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాము అని నమ్ముతున్నారు.అది నిజం కూడా!అందుకనే ఎంత కఠినమయిన ప్రక్రియలు అయినా ఇష్టంగా,నిష్టగా,మనసు పెట్టి అవలంబిస్తున్నారు.

No comments:

Post a Comment