Tuesday, 19 May 2026

యస్య సర్వే సమారంభాః

యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః। జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః॥19॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు చిన్నగా పండితుడు అంటే ఎవడు అనే విషయానికి వచ్చాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అర్జునా!నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా,కర్మ,అకర్మ,వికర్మలగురించి తెలుసుకోవాలని.ఇక్కడ సరిగ్గా అసలు సిసలు పండితుడు ఎవరో తెలుస్తుంది.మనము ఫలాపేక్ష రహితంగా ఉండాలి.నేను,అంతా నేనే,అంతా నాదే,నేనే కర్తను అనే అహంకారాన్ని వదులుకోవాలి.ఈ కర్తృత్వాహంకారం చాలా చెడ్డది.కాళ్ళు నేల మీద నిలువనీయదు.కళ్ళు నేలవైపు కాకుండా ఆకాశం వైపు చూసేలా చేస్తుంది.మన పతనానికి అదే బీజము.ఈ అహంకారాలన్నిటినీ భస్మం చేసే ఆయుథం ఒకటి ఉంది.అదే జ్ఞానాగ్ని.అలాంటి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ప్రక్క దోవలు పట్టడు.అతడే అసలైన పండితుడు.

No comments:

Post a Comment