Friday, 29 May 2026

యజ్ఞ శిష్టా మృత భుజో

యజ్ఞ శిష్టా మృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్। నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ॥31॥4॥ శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యాగము,యజ్ఞము చేయడమనేది మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమో చెబుతున్నాడు.అర్జునా!ఓ కురుసత్తమా!ఇంత దీర్ఘంగా,ఇందాకటి నుంచి నేను యాగము,యజ్ఞము గురించి ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుందా?ఎందుకంటే యజ్ఞ శేషము అమృతము లాంటిది.దానిని పొందిన వారు,అనుభవించినవారు శాశ్వత బ్రహ్మను పొందుతారు.అదేమీ చిన్నా,చితకా విషయం కాదు.లేనిపోని తలకాయ నొప్పి నాకెందుకులే స్వామీ!నాకు ఈ యజ్ఞాలు,యగాలు అవసరం లేదు అనుకునే వారు కూడా ఉంటారు.కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను,విను.వాడికి ఇహ లోకమే శూన్యం.అంటే పెద్ద సున్నా!ఇక్కడికే పనికిరాకపోతే,ఇంక పరలోకము ఎక్కడుంటుంది?కూపస్థ మండూకంలాగ,చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ బతకాల్సిందే!అంతే కదా!బావిలో కప్పకు బాహ్య ప్రపంచం గురించి ఏమి తెలుస్తుంది?దాని దృష్టిలో ఆ బావే బ్రహ్మాండం!అదే స్వర్గం!అదే నరకం!

No comments:

Post a Comment