Sunday, 10 May 2026

జన్మ కర్మ చ మే దివ్యం

జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః। త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోఽర్జున॥9॥5॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మోక్షానికి సులభమయిన మార్గం చెప్పకనే చెబుతున్నాడు.అర్జునా!సఖా!నేను ఈ సృష్టి ఉన్నంత కాలమూ మంచిని పరిరక్షిస్తూ ఉంటాను.చెడు ఎక్కడ,ఏమూలన దాగి ఉన్నా పట్టి,చీల్చి,చెండాడుతుంటాను.నా జన్మ,నా చేష్టలు,నా ఇష్టాయిష్టాలు తత్త్వ దృష్టితో తెలుసుకోగలగాలి.భౌతిక పరంగానే కాకుండా,విశ్లేషణాత్మకంగా తత్త్వ దృష్టితో తెలుసుకోవాలి.అలా చేయగలిగినప్పుడే మానవుడికి మరు జన్మ అంటూ ఉండదు.నేరుగా నన్నే పొందుతాడు.నన్ను పొందడం అంటే కైవల్యం సాథించినట్లే కదా!మోక్షానికి మూడు సూత్రాలు ఇవే!నన్ను తెలుసుకో,నన్ను నమ్ము,నన్ను ఆశ్రయించు.నాలో ఐక్యం చెందుతావు.

No comments:

Post a Comment