Friday, 15 May 2026

చాతుర్వర్ణ్యం మయా సృష్టం

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః। తస్య కర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్॥13॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఈ సృష్టికి అంతా నేనే కర్తను అని చెప్పాను కదా!గుణము,కర్మ అనే విభాగాలతో నాలుగు వర్ణాలనీ నేనే సృష్టించాను.ఈ సృష్టి,వర్ణ విభజన అన్నీ కూడా నాచేత చేయబడ్డ కర్మలే!కానీ కర్తృత్వం నాదే అయినా,నిజానికి నేను అకర్తను,అవ్యయుడిని.ఈ సూక్ష్మం నీవు అర్థం చేసుకుంటే చాలు. మాములుగా మన మనసు మనము ఏ కర్మలు చేసినా,తామరాకు మీద నీటి బొట్టులాగ అంటకుండాఉండాలని చెబుతాము కదా!దానికి నేనే అతి పెద్ద నిదర్శనము.ఏమి చేసినా,కనీసం ఆ కర్మలు నా వల్లే జరుగుతున్నాయి అని నమ్మను.ఒప్పుకోను.నిర్వికార స్థితి అంటే అదే!

No comments:

Post a Comment