Friday, 17 October 2025

చతుర్దశ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ఆత్మస్మృతి,శత్రుజయము కలుగుతాయి. పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు బయలుదేరాడు.అడవిలో వేటకుక్క కుందేలును తరుమసాగింది.అవి రెండూ ఒకదాని వెంట ఇంకొకటి పరుగులు తీస్తూ ఒక ఆశ్రమము దగ్గర ఉన్న బురద ప్రదేశము దగ్గరకు వచ్చాయి.అక్కడకు చేరగానే వైరం మానేసి,చెట్టా పట్టాలేసుకును మంచి మిత్రులు లాగా ఆటలాడుకోసాగాయి.ఇదంతా రాజుకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్రమములో వత్సుడు అనే ముని ఉన్నాడు.రాజు అతనిని వేటకుక్క,కుందేలు యొక్క విచిత్రమయిన ప్రవర్తనకు కారణము అడిగాడు.దానికి చిరునవ్వుతో ఆ వత్సుడు ఇలా సమాథానం ఇచ్చాడు. శ్లోకము... చతుర్దశంతు అధ్యాయం జపామి ప్రత్యహం నృప। మదీయ చరణాం భోజ ప్రక్షాళణ జలే లుఠన్॥ శ్లోకము.... శశస్త్రి దివమాపన్న శ్శునకాస్యహభూపతే। ఓ రాజా!నేను దినం దినం,ప్రతిదినం భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము పారాయణ చేస్తాను.నేను ప్రతిదినం కాళ్ళుకడుగుకునే ప్రదేశము ఆ బురద ఉండే స్థలము.కాబట్టి కుక్క,కుందేలు అక్కడకు రాగానే వాటి వాటి జాతివైరము మరచిపోయాయి.అలానే వాటికి ఆత్మ స్మృతి కలిగింది.అందుకే అవి అంత ఆలాజాలంగా మసలుతున్నాయి.ఇదంతా ఆ పదునాల్గవ అధ్యాయ పారాయణ ఫలము,ఫలితము.

No comments:

Post a Comment