Thursday, 2 October 2025

గీతా గంగా చ గాయత్రీ

గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే। చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే॥ గీత యొక్క గొప్పదనం మహాభారత గ్రంథంలో కూడా ఉటంకించారు.గీత,గంగ,గాయత్రీ,గోవింద అనే ఈ నామాలు మనకు పరమ పవిత్రమయినవి.భగవద్గీత మహాత్మ్యము మనము చెప్పుకున్నాము కదా!అన్ని నదీ జలాలలోకి గంగ పవిత్రమయినది.నేరుగా శివుడి జటాజూటం నుంచి భూమిపైకి ఉరకలేస్తూ సాగే జీవనది.గాయత్రీ మంత్రము ఎంత పవిత్రమయిన మంత్రమో అందరికీ తెలుసు.అలాగే గోవింద నామము.ప్రముఖంగా ఈ కలియుగంలో గోవింద గోవింద అనే నామము యొక్క ప్రాశస్త్యము మనందరికీ తెలుసు.గ కారముతో మొదలు అయే ఈ నాలుగు నామాలను విడవకుండా సతతమూ తలుస్తూ ఉండాలి.అలాంటి వారికి పునర్జన్మ అనేది ఉండదు అని ప్రగాఢ నమ్మకము.పునర్జన్మ లేదంటే పరమపదము మనకు దక్కినట్లే కదా!

No comments:

Post a Comment