Thursday, 30 October 2025
గీతా మే పరమావిద్యా
గీతా మే పరమావిద్యా బ్రహ్మరూపా న సంశయః।
అర్థమాత్రా క్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా॥8॥
శ్రీకృష్ణ పరమాత్ముడు అయిన భగవంతుడు అంటున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీత పరమపదాన్ని బోధించే విద్యను మానవాళికి సమకూర్చుతుంది.ఇదే పరబ్రహ్మ స్వరూపము.ఇదే అర్థమాత్ర.గీతా సారము నాశనము లేనిది.శాశ్వతమయినది.స్వయంగా ప్రకాశించేది.స్వబోధం అయినది.స్వకీయం అయినది.భగవద్గీత అంటే నిర్దిష్టంగా ఇది అని ఎవ్వరూ ప్రకటించలేరు.ఎందుకంటే ఇది విశ్వ వ్యాపకము.ఇది స్పృశించని గుణం,భావము,భావన,విషయ సంగ్రహణ అంటూ ఏమీ మిగిలి లేవు.ఇది ఉత్తమోత్తమ మయిన గ్రంథ రాజము.
అర్థమాత్ర అనేది ఓం కార రూపంలోని సూక్ష్మ భాగము.ఇది బిందువు,నాదముల కలయికతో అ,ఉ,మ తర్వాత నాలుగో భాగంగా గుర్తించ బడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment