Tuesday, 21 October 2025
అష్టాదశ అధ్యాయము…ఫలము
భగవద్గీత లోని పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్న్యాస యోగము.దీని పారాయణ ఫలము వలన సర్వపుణ్యాలు దక్కుతాయి.అలానే సిద్ధిప్రదము అవుతుంది.
పూర్వము విష్ణుదూతలు ఒక పురుషుడిని ఇంద్రలోకానికి తీసుకుని వచ్చారు.రావటం రావటం అతనిని ఇంద్ర సింహాసనము పైన కూర్చోబెట్టారు.అంతటితో ఆగలేదు.కొన్నాళ్ళు ఇతడే ఇంద్రాధిపత్యము కొనసాగిస్తాడు అని శాసించారు.
ఇంద్రుడికి వెన్నులో జ్వరము వచ్చింది,ఈ పరిణామానికి.నేరుగా వైకుంఠం పోయాడు.నారాయణా!మాథవా!ఏంది ఈ విడ్డూరము?నా సింహాసనము ఎక్కే అర్హత సామాన్య మానవుడు ఎలా సాథించాడు?దానితో ఆగకుండా కొన్నాళ్ళు ఇంద్ర పదవి దక్కేటంత పుణ్యము ఏమి చేసాడు?అని అడిగాడు.
దానికి శ్రీమహా విష్ణువు తన చెరగని చిరునవ్వుతో ఇలా సమాథానం చెప్పాడు.ఇంద్రా!ఆ మానవుడు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయము లోని అయిదు శ్లోకాలు నిత్యమూ జపించేవాడు.దాని ఫలమూ,ఫలితమే ఈ ఇంద్ర పదవి.
శ్లోకము
......
జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోక పంచకమ్।
యత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమమ్॥
విష్ణువు మాటలకు అందరికీ తలలు గిర్రున తిరిగాయి.అది మొదలు ముక్కోటి దేవతలూ నిత్యమూ భగవద్గీతలోనిపద్దెనిమిదవ అధ్యాయము పారాయణ చేయటం మొదలు పెట్టారు,వారి వారి పదవులు నిలబెట్టుకునేదానికి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment