Tuesday, 21 October 2025

శ్రీ భగవద్గీతా పూజా విధాన క్రమము

భగవద్గీతను భక్తి విశ్వాసముతో పూజించుకొననవచ్చును.అవినాశనము,అద్భుతమయిన కర్మకర్తృత్వము,విభూతి,అధికారము,సర్వజ్ఞత,అఖండ శక్తి...ఈ ఆరింటినీ భగము అని అంటారు.ఈ ఆరు గుణాలూ కలిగిన వారిని భగవంతుడు అని అంటారు లేక భగవతీ అని అంటారు.మనము శ్రీకృష్ణుడిని భగవంతుడుగా నమ్మాము.అతని చేత చెప్పబడినది కాబట్టి భగవద్గీత అనే నామం సార్థకమయినది.అంతేకాదు.అది భగవద్వాణి కాబట్టి గీతను భగవతీ అని,అద్వైతామృతవర్షిణి అని,అంబ అని,భవద్వేషిణి అని అందరూ నమ్మి కీర్తిస్తారు. కాబట్టి భగవద్గీతను పూజించడమంటే భగవదారాథన చేసినట్లే!మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాదయంతి.ఆ రోజు పూజించికోవచ్చు.మంచి పని చేసేదానికి ప్రతిరోజూ మంచిరోజే కాబట్టి ఎప్పుడైనా పూజించుకోవచ్చు. మామూలుగా ఆచమనం,ప్రాణాయామం,ఘంటారావం,సంకల్పం చెప్పుకోవాలి.ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.కృష్ణ అష్టోత్తర శతనామావళి,గీతా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. వక్త్రాణి పంచజానీహి పంచాధ్యాయాననుక్రమాత్। దశాధ్యాయాః భుజాశ్చైక ముదరంద్వే పదాంబుజే॥ ఏవమష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరీశ్వరీ। జానీహి జ్ఞానమాత్రేణ మహాపాతకనాశినీ॥ ఓం గీతాయై నమః ధ్యానం సమర్పయామి సర్వతీర్థ మయై నమః ఆవాహయామి అక్షరాయై నమః ఆసనం సమర్పయామి మల నిర్మోచిన్యై నమః పాద్యం సమర్పయామి సత్యాయై నమః అర్ఘ్యం సమర్పయామి విష్ణోర్వక్త్రా ద్వినిసృతాయై నమః ఆచమనం సమర్పయామి వంద్యాయై నమః పంచామృత స్నానం సమర్పయామి తదుపరి శుద్ధోదక స్నానం సమర్పయామి విశ్వ మంగళ కారిణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి సర్వ శాస్త్రమయై నమః యజ్ఞోపవీతం తదుపరి ఆభరణాని సమర్పయామి సర్వైశ్వర్య ప్రదాయిన్యై నమః శ్రీ గంధం సమర్పయామి భారతామృత సర్వస్యాయై నమః పుష్పాక్షతాన్ సమర్పయామి. ।।।।।।।।।।।।।।॥॥॥।।।।। ఓం ఇతి శ్రీ భగవద్గీతా అష్టోత్తర శతనామావళి పుష్పాంజలి పూజాం కరిష్యామి ఓం అష్టాదశాధ్యాయిన్యై నమః నానావిథ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ఓం భవ ద్వేషిణ్యై నమః ధూపమాఘ్రాపయామి ఓం సర్వోపనిషత్సార రూపిణ్యై నమః దీపం దర్శయామి ఓం అద్వైతామృత వర్షిణ్యై నమః నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,ఉత్తరాపోశనం సమర్పయామి ఓం వ్యాసేన గ్రథితాయై నమః తాంబూలం సమర్పయామి ఓం భారత పంకజ స్వరూపాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి ఓం భయ శోకాది వివర్జితాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి ఓం లోక త్రయోప కారిణ్యై నమః ప్రదక్షిణం సమర్పయామి ఓం సర్వజ్ఞాన మయ్యై నమః సర్వోపచార పూజాం కరిష్యామి అనయా మయాకృత ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతీ శ్రీ గీతా దేవతా సుప్రీతా భవతు,సుప్రసన్నా భవతు,వరదా భవతు. ఇతి శ్రీ మద్భగవద్గీతా పూజా స్సమాప్తా.....

No comments:

Post a Comment