Sunday, 19 October 2025
షోడశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ ఫలము వలన ధైర్య సాహసాలు,జంతు వశీకరణము ప్రాప్తిస్తాయి.
ఒకప్పుడు ఒకరాజు దగ్గర ఒక ఏనుగు ఉండేది.అది ఒకసారి కట్లు తెంచుకుని,అదుపు తప్పి గందర గోళంచేయసాగింది.దానిని ఎవరూ ఆపలేక పోయారు.అలాంటి సమయంలో ఒక సాథారణ పౌరుడు వచ్చి దానిని నిమిరాడు.అది మంత్రము వేసినట్లు చప్పబడిపోయింది.శాంతంగా తయారయింది.మంచిగా అదుపు ఆజ్ఞల్లోకి వచ్చింది.అందరూ ఆశ్చర్య చకితులు అయ్యారు.ఇదంతా చిటికెలో ఎలా సాథ్యమయింది నీకు అని అడిగారు.ఆ శక్తి ఏంది?నీకు ఎలా వచ్చింది?మేమంతా తెలుసుకునే దానికి ఉబలాట పడుతున్నాము అని అన్నారు.
అంతట అతను చెరగని చిరునవ్వుతో ఇలా అన్నాడు.
శ్లోకము
........
గీతాయాః షోడశాధ్యాయ శ్లోకాన్కతిపయానహమ్।
జపామి ప్రత్యహం భూపతేనైతా స్సర్వసిద్ధయః॥
అయ్యా!నేను నిత్యమూ భగవద్గీత లోని పదహారవ అధ్యాయము పారాయణ చేస్తాను.ఆ పారాయణ వల్ల కలిగే పుణ్య ఫలమే ఇదంతా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment