Monday, 20 October 2025
సప్తదశ అధ్యాయము…ఫలము
భగవద్గీత లోని పదహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ వలన సర్వ వ్యాధి నివారణ కలుగుతుంది.
శ్లోకము
.......
గీతాసప్తదశాధ్యాయ జాపకం ద్విజమానయ।
తేనాయం మామకోరోగశ్శామ్యత్యత్ర న సంశయః॥
దీనికి సంబంధించిన కథ తెలుసుకుందాము.పూర్వము ఒక రాజు ఉండేవాడు.ఆయనగారి ఏనుగు ఒకసారి జబ్బున పడింది.ఎంత మంది వైద్యులకు చూపించినా స్వస్థత చేకూరలేదు.ఇక వీళ్ళ పైన వదిలేస్తే లాభం లేదని ఆ ఏనుగుకు కూడా అర్థమయిపోయింది.ఆ ఏనుగు హీనస్వరముతో రాజుకు చెప్పింది.హే రాజా!భగవద్గీత యొక్క పదహేడవ అధ్యాయము చేసే వానిని పిలిపించండి.అతని చేత నా ముంగిట ఆ అధ్యాయము పారాయణ చేయించండి.అప్పుడు నా వ్యాధి నయమవుతుంది.
రాజుకు ఆ సలహా బాగా నచ్చింది.సరే అని అలాగే బ్రాహ్మణులచేత భగవద్గీతలోని పదహేడవ అధ్యాయము పారాయణ చేయించాడు.ఏనుగుకు జబ్బు నయమయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment