Saturday, 18 October 2025

పంచదశ అధ్యాయము…ఫలము

భగవద్గీత లోని పదహైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్లోకము ........ అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్। తతోవాచయతః శ్రుత్వానిరగాత్తుర గోదివమ్॥ దీనికి సంబంధించిన కథ విందాము.పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు.వేటాడి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.గాలికి ఎగిరి ఒక తాళపత్రము అతని దగ్గరలో పడింది.ఆ తాళ పత్ర గ్రంథములో ఉన్నది పైకి చదివాడు.అది రాజు గారి గుర్రము వినింది.వెను వెంటనే దివ్య రూపము సంతరించుకుని,ఆకాశ మార్గములో ఎగసి పోయింది. రాజు కి అశ్చర్యము వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమము కనిపించింది.అక్కడకు వెళ్ళి ఋషులకు జరిగిన విషయము చెప్పాడు.వాళ్ళు తాళపత్రము తమదే అని చెప్పారు.అందులో భగవద్గీతలోని పదహైదవ అధ్యాయములోని సగము శ్లోకము ఒకటి లిఖించబడి ఉంది అని చెప్పారు.ఆ సగము శ్లోకము విన్నందుకు దక్కిన పుణ్యము వలన ఆ గుర్రమునకు పరమ పథం లభించింది అని చెప్పారు. అప్పుడు ఆ రాజు ఋషుల దగ్గర భగవద్గీత యొక్క పదహైదవ అధ్యాయము పారాయణానుష్ఠానాదులు తెలుసుకున్నాడు.అప్పటి నుండి నిత్యపారాయణ చేసుకుంటూ తానుకూడా తరించాడు.

No comments:

Post a Comment