Wednesday, 8 October 2025

తృతీయ అధ్యాయము..ఫలము

తత్రాధ్యాయం సగీతాయాస్తృతీయం సంజజాపహ॥ భగవద్గీతలోని తృతీయ అధ్యాయము కర్మ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే పాపనాశనముఅవుతుంది.దానితో బాటు ప్రేతత్వ విముక్తి కూడా కలుగుతుంది. పూర్వము జడుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.వాడి కులాచారము అస్సలంటే అసలు పాటించేవాడు కాదు.దురాచారాలకు పాలపడుతుండేవాడు.ఇలాగే అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు.డబ్బులకు కక్కుర్తి పడిన దొంగలు కొందరు అతనిని దోచుకుని,ఒక చెట్టు క్రింద హతమార్చారు.జడుడు పాపాల పుట్టగా ఉన్నాడు కదా బతికినన్ని రోజులు!అందుకని ప్రేతాత్మ అయి ఆ చెట్టుపైనే ఉంటూ వచ్చాడు.కొంతకాలము తరువాత అతని కొడుకు కాశీకి బయలుదేరాడు.మార్గమధ్యంలో అలసిపోయి,ఆ చెట్టిక్రిందనే సేదతీరాడు.యధాలాపంగా భగవద్గీత తెరచి మూడవ అధ్యాయము పఠించాడు.అలా పారాయణము పూర్తికాగానే జడుడికి ప్రేతరూపము పోయింది.దివ్యరూపముతో విమానము ఎక్కి స్వర్గానికి పయనమయ్యాడు.అలా పోతూ పోతూ తన కొడుకుని ఉద్దేశించి ఇలా అన్నాడు.నాయనా!కుమారా!నీవు భగవద్గీత మూడవ అధ్యాయము చదవటం వలన నా ప్రేతత్వము పోయి,దివ్యరూపము చేకూరింది.స్వర్గానికి కూడా పోతున్నాను.ఇది చాలా శక్తివంతమయిన అధ్యాయము.కాబట్టి నీవు క్రమం తప్పకుండా అనునిత్యం పారాయణ చెయ్యి.నీ జీవితము ధన్యమవుతుంది.జడుడు ఇలా తన కొడుకును ఆశీర్వదించి,స్వర్గానికి పయనమయినాడు.

No comments:

Post a Comment