Wednesday, 22 October 2025
శ్రీ భగవద్గీతా పారాయణ క్రమము
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
ఓం అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్।
తత్పదం దర్శితంయేన తస్మై శ్రీ గురవే నమః॥
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్।
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥
ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥
ఓం వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥
మనసును ఏకాగ్రము చేసి మనకు మనము అర్జునుడు లాగా ఊహించుకోవాలి.ఆ భగవంతుడే స్వయముగా మనకు భగవద్గీత ఉపదేశిస్తున్నట్లుగా భావించాలి.
వినియోగాదిః
..........
ఓం అస్య శ్రీ మద్భగవద్గీతా శాస్త్ర మహామన్త్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః
శ్రీ కృష్ణ పరమాత్మా దేవతా,
అశోచానన్వ శోచస్త్వమితి బీజమ్॥
సర్వధర్మా న్పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తిః।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ ఇతి కీలకమ్।
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరీష్యః ఇతి కవచమ్।
కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇతి అస్త్రమ్।
అనాది మధ్యాంత మనంతవీర్యం ఇతి ధ్యానమ్।
జ్ఞాన యజ్ఞేన భగవదారాధనార్దే।
శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః॥
కరన్యాసము
........
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః....ఇత్యంగుష్ఠాభ్యాం నమః
(రెండు చేతులు బొటన వ్రేళ్ళను రెండు చూపుడు వ్రేళ్ళతో తాకవలెను.)
నచైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః...ఇతి తర్జనీభ్యాం నమః
(చూపుడు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
అచ్చేద్యోయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవచ...ఇతి మధ్యమాభ్యాం నమః
(నడిమి వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః....ఇత్యనామికాభ్యాం నమః।
(ఉంగరపు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రసః...ఇతి కనిష్ఠికాభ్యాం నమః।
(చిటికెన వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
నానా విధాని దివ్యాని నానావర్ణకృతీని చ...ఇతి కరతల పృష్ఠాభ్యాం నమః।
(రెండు అరచేతుల వెనకవైపులను క్రమముగా స్పృశించ వలెను.)
అంగన్యాసము
............
నైనం ఛిందంతి శస్త్రాణి-నైనం దహతి పావకః....ఇతి హృదయాయ నమః।
(కుడి చేతితో హృదయమును స్పృశించుకోవలెను.)
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః... ఇతి శిరసే స్వాహా।
(కుడి తేతితో హృదయము స్పృశించుకోవలెను.)
అచ్ఛేద్యోఽయ మదాహేయోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ...।ఇతి శిఖాయై వషట్।
(శిఖను తాకవలెను.)
నిత్య స్సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః...ఇతి కవచాయ హుం।
(కుడి చేత ఎడమ భుజమును,ఎడమ చేత కుడి భుజమును తాకవలెను.)
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః....ఇతి నేత్ర త్రయాయ వౌషట్।
(కుడి చేత నేత్రములను తాకవలెను.)
నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ...ఇత్యస్త్రాయ ఫట్।
(కుడి చేయి తలచుట్టూ త్రిప్పుకుని నడి వ్రేలుతో ఎడమ చేత చప్పట్లు కొట్టవలెను.)
పిమ్మట ధ్యానము చేయవలెను.
మహా భారత ధ్యానము
.................
పారాశర్య వచః సరోజ మమలం గీతార్థ గంధోత్కటమ్।
నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితమ్॥
లోకే సజ్జన షట్పదైరహరహః పేపాయమానం ముదా।
భూయాద్భారత పంకజం కలిమల ప్రథ్వంసినః శ్రేయసే॥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment