Saturday, 4 October 2025

సప్త శ్లోకీ గీత

ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్। యః ప్రయాతి త్యజన్దేహం సయాతి పరమాం గతిమ్॥8-13 స్థానే హృషీకేశ తనప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్య తేచ। రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః॥11-36 సర్వతః పాణి పాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్। సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి॥13-14 కవిం పురాణ మనుశాసితారమణోరణీయాంస మనుస్మ రేద్యః। సర్వస్య ధాతార మతిన్త్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్॥8-9 ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్। ఛంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥15-1 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ। వేదైశ్త సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15-15 మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు। మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః॥9-34 హే అర్జునా!ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మపరమైన ఓం అనే మహా మంత్రాన్ని ధ్యానించాలి.సదా నన్నే స్మరిస్తూ ఉండాలి.అలాంటి అవస్థలో దేహత్యాగం చేసేవాడు పరమ పదాన్ని సునాయాసంగా పొందుతాడు.8-13 అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసి ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే హృషీకేశా!నీ గుణగణాల కీర్తనలతో ప్రపంచం అంతా ఆనందిస్తుంది.రాక్షసులు ఏమో భయంతో వణికి పోతున్నారు.ఎటు పోవాలో తెలియక నలుదిక్కులకూ పరుగులు తీస్తున్నారు.మునులు,సిద్థులు అవథులు దాటిన ఆనందంతో నీకు నమస్సుమాంజలులు అర్పిస్తున్నారు.11-36 అత్యుత్తమమయిన జ్ఞానమే పరబ్రహ్మము.ఎటు చూసినా కాళ్ళు,చేతులు ,ముఖాలు,చెవులూ కలిగి అది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది.13-14 భగవంతుడు అనేవాడు కవి,పురాణపురుషుడు.అతను ఈ జగత్తును అంతా నియమించిన వాడు.అణువు కంటే సూక్ష్మం అయినవాడు.అయినా సర్వ జగత్తునూ పాలించేవాడు.ఈసృష్టి మొత్తం అతని పైనే ఆథారపడి ఉంది.వేయి సూర్యులకంటే ఎక్కవ వెలుగునిచ్చేవాడు.అజ్ఞానపు అంథకారాన్ని తొలగించేవాడు.ఆపరమాత్మను మనము ఆరాధించాలి.అప్పుడు ఖచ్చితంగా ఆ పరమాత్మనే పొందగలుగుతాము.8-9 శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఒక అశ్వత్థ వృక్షము ఉంది.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలేమో క్రిందికి ఉంచాయి.వేదాను వాకాలను ఆకులుగా కలిగి ఉంటుంది.దానికి నాశనము అనేది లేదు.ఆ వృక్షము గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు.15-1 శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!అందరిలో నేనే ఉన్నాను.ఎలా అనుకున్నావు?వారి అంతరాత్మలాగా నిబిడీకృతమై ఉంటాను.మనషిలో కనిపించే జ్ఞాపకం,జ్ఞానము,మరపు...ఇలా ప్రతి ఒక్క గుణము నా వల్లనే కలుగుతున్నాయి.నేను ఎవరనుకున్నావు?నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.వేదవేత్తను కూడా నేనే.సమగ్రంగా చెప్పాలంటే కర్త,కర్మ,క్రియలు నేనే.నన్ను మించి ఇంకేమీ లేదు.15-15 శ్రీకృష్ణుడు ముక్తాయింపుగా ఈ సూచన,సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు ఒక చిన్న చిట్కా చెబుతాను.నువ్వు నాయందే మనసు నిలిచేటట్లు చేసుకో.నా భక్తుడివి అయ్యేదానికి నడుము బిగించునన్నే సేవించి తరించు.నన్నే నమ్ముకో!నాకే నమస్కారము చెయ్యి.నాయందే నీ దృష్టి నిలిచేలా చేసుకో!అంటే ఒక రకంగా నాతోటి మమేకం అవ్వాలి అని చెబుతున్నాడు.ఇలా చేస్తేనే నన్ను పొందగలవు.పరమపదమూ పొందగలవు.

No comments:

Post a Comment