Thursday, 2 October 2025

గీతతో నా స్నేహం

నేను చిన్నప్పుడు మా బాబు(నాన్న)రోజూ స్నానంచేసి వచ్చి దేవుడి ముందర భగవద్గీత చదవడం చూసేదాన్ని.నేను మొట్ట మొదటి సారి నా తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు దానిని పట్టుకుని ఒక్క శ్లోకం కూడుకుంటూ చదివాను ఒక్కొక్క పదం.తరువాత చిన్నగా అలవాటు అయి ఇప్పుడు రోజూ గీత మొత్తం చదివే స్థితికి వచ్చాను.నాకు గీత ఏమనిపిస్తుందో చెబుతాను. తప్పు ఎవరు చేసినా తప్పే.ఒప్పు ఎవరు చేసినా ఒప్పే.మన బిడ్డ చేసాడని తప్పు ఒప్పు కాదు.ఇష్టం లేని వారు చేస్తే ఒప్పు తప్పుకాదు.ధర్మానికి తన మన అని ఉండదు.దాని దారిలోకి మనము రావాలి కానీ మన దారిలోకి అది రాదు.భగవద్గీత మొత్తమూ మనుష్య సంబంధాలు...అదే తల్లిదండ్రులు,భార్యాబిడ్డలు,తోడబుట్టినవాళ్ళు,బంధుజనం గురించి చెప్పదు.మానవుడు సమస్త ప్రాణికోటితో ఎలా నడచుకోవాలో చెబుతుంది.సంయమనం పాటించమంటుంది.పిరికితనం,భయం వద్దంటుంది.తప్పు చేస్తే భయపడాలి.కాబట్టి ఆ తట్టే వెళ్ళ వద్దు అంటుంది.ఫలాపేక్ష లేకుండా సమాజహితం కోసం పాటుపడమంటుంది.కామక్రోధలోభమదమాత్సర్యాలకు దూరంగా ఉండమంటుంది.

No comments:

Post a Comment